ఒకరికి ఒకరు ఏ మాత్రం తగ్గకుండా
గ్రూప్ రాజకీయాల్ని నడపటంలో దిట్ట అయిన విశాఖ జిల్లా టీడీపీ నేతలకు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
గంటా శ్రీనివాసరావు టీడీపీ తీర్థం
పుచ్చుకున్న నాటి నుంచి. అయ్యన్న పాత్రుడు ఆవేశంతో రగిలిపోతున్నారు.
అంతవరకూ అధికారాన్ని అనుభవించి.. చివర్లో పార్టీ మారి.. మళ్లీ
అధికారాన్ని చేజిక్కించుకునే సమయంలో పార్టీలోకి చేరటం.. దీనికి
తగ్గట్లే బాబు పెద్దపీట వేయటం అయ్యన్నపాత్రుడికి అస్సలు నచ్చలేదు.
తన మనసులోని అసంతృప్తిని ఆయన మాటల్లో వెల్లడించారు కూడా.
జిల్లా రాజకీయాల్పి పక్కన పెడితే..
రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ప్రయోజనంగా మారే నిర్ణయాల్ని తీసుకునే
పనిలో భాగంగా గంటాను బాబు పార్టీలోకి తీసుకున్నారు. అయితే.. ఈ విషయాల్ని
అయ్యన్నకు కొంతమేర వివరించినా.. ఆయన వాటిని పెద్దగా
పట్టించుకోలేదని చెబుతారు.
గంటా పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి
విశాఖ జిల్లాలో అసంతృప్త రాజకీయాలు రోజురోజుకీ పెరిగిపోవటమే కాదు.. గంటా
మీద పరోక్ష వ్యాఖ్యలు చేయటం.. పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తుంది.
దీనికి తగ్గట్లే గంటా కూడా
ప్రతిస్పందించటంతో.. విశాఖ జిల్లాలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకీ
ముదిరిపోతున్నాయి.ఇది ఎంతవరకూ వెళ్లిందంటే.. ఏపీ మంత్రి
అయ్యన్నపాత్రుడు ఈమధ్యన మాట్లాడుతూ.. తన గెలుపు విషయంలో విపక్షం
సాయం చేసిందని.. సొంత పార్టీ నేతలు తనను ఓడించాలని చూశారంటూ
వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని
చెబుతున్నారు.
గ్రూపు తగదాల విషయంలో కఠిన నిర్ణయాలు
తీసుకోలేని చంద్రబాబు వైఖరిని.. అలుసుగా తీసుకొని ఇద్దరు నేతలు
చెలరేగిపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్న వేళ.. బాబు ఇద్దరు
నేతలపై మండిపడినట్లు చెబుతున్నారు. ఇద్దరూ గ్రూపు రాజకీయాలు
మానుకోవాలని తాను ఎన్నోసార్లు చెప్పానని.. ఈ తీరు మంచిది కాదని. దీన్ని
మార్చుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. బాబు సీరియస్ అయితేనే..
గంటా.. అయ్యన్నలు తమ తీరు మార్చుకుంటారా? అదే ఉంటే.. అసలు గొడవ
పడేవారా? మరి.. చంద్రబాబు కోపం ఈ ఇద్దరు మంత్రులపై ఎంతవరకూ పని
చేస్తుందో చూడాలి.
Social Buttons