గోపాల
గోపాల తర్వాత విక్టరీ వెంకటేష్ నటించే సినిమా ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఓ
మంచి కథ కోసం చాన్నాళ్లుగా వెంకీ ఎదురుచూస్తున్నాడు. అయితే వెంకీ అనుకున్న
విధంగా ఇప్పుడో మంచి కథ కుదిరిందని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. ఓ యువ రచయిత
వెంకటేష్ కోసం మంచి కథ అందించాడట. దీంతో ఈ కథనే ఫైనల్ చేస్తున్నట్టు
సమాచారం. మరో వైపు నందమూరి హీరోని డైరెక్ట్ చేసిన దర్శకుడు ఈ సినిమాను
రూపొందించనున్నాడు. భారీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
మల్టీస్టారర్ గా ఆ చిత్రాన్ని మలచనున్నారు. ఓ యువ హీరో ఈ చిత్రంలో
నటించనున్నారు. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈ
చిత్ర స్క్రిప్ట్ గురించి ఫైనల్ డిస్కషన్స్ జరగనున్నాయి. త్వరలోనే ఈ
చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
Tags: Venkatesh New Multi Star Movie Updates | Venkatesh | Rana
Social Buttons