సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాల జాతర
ఖాయమని ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ 'లయన్',
అనుష్క 'రుద్రమదేవి', ప్రభాస్ 'బాహుబలి' తదితర పెద్ద సినిమాలతోపాటు 'పండగ
చేస్కో', 'కిక్ 2' లాంటి సినిమాలూ లైన్లో ఉన్నాయి. ఏది ముందుకి? ఏది
వెనక్కి? అనంటే చెప్పడం కష్టంగా కనిపిస్తోంది. వచ్చేస్తాయనుకున్న పెద్ద
సినిమాలు అటూ ఇటూ అవుతుండడంతో ఓ మోస్తరు, చిన్న సినిమాలకు లైన్ క్లియర్
అయ్యేలా ఉంది. 'లయన్' త్వరలో వచ్చేస్తుందని అంటున్నా, అదెప్పుడో
తెలియడంలేదు. 'రుద్రమదేవి' అనూహ్యంగా వెనక్కి వెళ్ళిందట.
మే రెండో వారంలో విడుదల కావాల్సిన
'బాహుబలి' ఎప్పటికి వస్తుందో చెప్పలేని గందరగోళం నెలకొంది. సమ్మర్
సీజన్‌ని మిస్సవడానికి పెద్ద సినిమాల నిర్మాతలెవరూ ఛాన్స్ తీసుకోరు. కానీ
పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడిన
'రుద్రమదేవి', 'బాహుబలి'కి ఇతర సమస్యలూ ఉండటంతోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ
రావడంలేదట. ఈ సినిమాలు వస్తున్నాయని రిలీజ్ వాయిదా వేసుకున్న వారు,
షెడ్యూల్స్ అలా ప్లాన్ చేసుకున్నవాళ్లు ఇప్పుడు ఉన్నపళంగా ముందుకి రాలేక
నానా అవస్థలు పడుతున్నారట.
Social Buttons