డిఫరెంట్
చిత్రాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తూ, 24
ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్
‘డైనమైట్’. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘వెన్నెల’ వంటి విలక్షణ చిత్రాల
దర్శకుడు దేవాకట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతి సినిమాలో ఏదో
ఒక వైవిధ్యతను కోరుకునే మంచు విష్ణు ఈ సినిమాకోసం రగ్ డ్ లుక్, చెవిరింగ్,
చేతిపై టాటూతో డిఫరెంట్ గా దర్శనమియ్యనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన
ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇటీవల విజయ్ మాస్టర్ నేతృత్వంలో
మంచు విష్ణు, చక్రవర్తి, 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, చిత్రీకరించిన
యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అయ్యేవిధంగా విష్ణు హై వోల్జేజ్ యాక్షన్ తో
అలరించనున్నారు. జె.డి.చక్రవర్తి మంచు విష్ణుతో కలిసి నటిస్తున్నారు. అంతే
కాకుండా చక్రవర్తి ఇందులో విలన్ గా చేయడం సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుందని
యూనిట్ భావిస్తోంది. ఇటీవల నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో వేసిన
భారీ సెట్ లో చిత్రీకరించారు. విష్ణు, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతలపై ప్రేమ్
రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో 100 డ్యాన్సర్స్ పై ఐదు రోజులు పాటు ఈ పాటను
చిత్రీకరించారు. పోస్ట్ పొడ్రక్షన్ కార్యక్రమాలు సహా అన్నీ కార్యక్రమాలను
పూర్తి చేసి పాటలను త్వరలోనే విడుదల చేసి సినిమాని సమ్మర్ కానుకగా విడుదల
చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
Tags: Manchu Vishnu Dynamite Movie Updates , Dynamite Movie , Manchu Vishnu , Pranitha Subash
Social Buttons