Latest News

శర్వానంద్ కోసం బాలీవుడ్ బ్యూటీని తెస్తున్నారు...?
by MTW - 0




శర్వానంద్ కొత్తగా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అంతే కాదు కథల ఎంపికలోనూ... విభిన్నంగా ట్రై చేస్తాడు. తాజాగా తాను నటించబోయే సినిమా కోసం కూడా కథ, కథనం, క్యాస్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ ఓ సినిమా తెరకెక్కించనుంది. రన్ రాజా రన్ తర్వాత వీరి కాంబినేషన్ కు క్రేజ్ పెరిగింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మేర్లపాక గాంధి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్లో త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.

పగ్లీ అనే హిందీ చిత్రంలో నటించిన కైరా అద్వానీని శర్వానంద్ సరసన హీరోయిన్ గా పెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే కైరాను ఎంపిక చేశారని అంటున్నారు. వీరిద్దరి పెయిర్ కూడా బాగుంటుందని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు.
« PREV
NEXT »