Latest News

అమ్మో రకుల్.. ఇక బాక్సాఫీస్ బద్దలే
by MTW - 0



రకుల్ ప్రీత్ సింగ్.. ప్రజెంట్ టాలీవుడ్ ని ఏలుతున్న వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ఏ ముహూర్తంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కాని.. ఎవరి ఊహాలకు అందనంత స్పీడ్ గా దూసుకెళుతోంది ఈ అమ్మడు.

కెరటం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేకపోయినా.. ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో అమ్మడి అదృష్టమే మారిపోయింది. చేసిన సినిమా చేసినట్టు హిట్టవుతుండటంతో..  స్టార్ హీరోలు కూడా రకుల్ నామస్మరణే చేస్తున్నారు. ఫలితంగా అమ్మడి క్యాలెండర్ కి ఖాళే లేకుండా పోతోంది.

టాలీవుడ్ లో తాజా క్రేజీ ప్రాజెక్టులైన కిక్ 2, పండగ చేస్కో సినిమాల్లో రకులే నటిస్తోంది. ఇవి పూర్తి కాకుండానే మరో రెండు, మూడు బిగ్ షాట్స్ తగిలాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్  అప్ కమింగ్ మూవీల్లోనూ అమ్మడికే అవకాశం దక్కింది..అయితే ఈ బిజీలో  డేట్ అడ్జెస్ట్ చేయలేక ప్రిన్స్  బ్రహ్మోత్సవంలో చాన్స్ మిస్ అయిందన్న వార్తలు వినిపించాయి. కాని అవేవి నిజం కాదని తెలుస్తోంది. ఆ మూవీలోనూ ఈ బ్యూటీనే కన్ఫామ్ అయిందని సమాచారం.

Tags: Rakul Preet Singh Hulchul in Telugu Movies , Rakul Preet Singh
« PREV
NEXT »