Latest News

ఆంధ్రాపోరి మోషన్ పోస్టర్ విడుదల చేసిన దర్శకేంద్రుడు
by MTW - 0
ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం‘ఆంధ్రాపోరి’. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శ‌కుడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. చిత్రయూనిట్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్,www.andhrapori.com వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా...
కె.రాఘవేంద్రావు మాట్లాడుతూ ‘’ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్.. ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు. ఎంతో మంది నటీనటులను స్టార్స్ గా చేసిన సంస్థ. ఆ బ్యానర్ లో వస్తోన్న ఆంధ్రాపోరి పెద్ద విజయాన్ని అందుకోవాలి. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’నేను, రాఘవేంద్రరావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో కలిసే పెరిగాం. మరాఠీలో విజయవంతమైన టైమ్ పాస్ చిత్రాన్ని ఆంధ్రాపోరి పేరుతో రీమేక్ చేశాం. మరాఠీలో విజయవంతమైన విధంగానే ఇక్కడ కూడా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.
ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ‘‘రాఘవేంద్రరావుగారు వచ్చి ఈ పోస్టర్ ను లాంఛ్ చేసినందుకు ఆయనకి స్పెషల్ థాంక్స్. ఆయనతో మాట్లాడేటప్పుడు నలభై ఏళ్లు పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆయనతో తొలిసారి మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో ఎంతో కేర్ కనపడింది. ప్రతి సినిమా గురించి ఆయనతో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రసాద్ ప్రొడక్షన్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థకి ఎంతో పేరుంది. అలాంటి సంస్థలో చిన్న దర్శకుడినైనా నేను రెండో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రాపోరి అనే చిత్రంలో తెలుగు అమ్మాయిని కాకుండా ఉల్కాగుప్తాను సెలక్ట్ చేసుకోవడం వెనుక చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు. అయితే ఉల్కా కమిట్ మెంట్ ను చూసి తననే హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాం. ఆకాష్ చాలా సూపర్ గా నటించాడు. ఇద్దరూ మా సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. మా జర్నీలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి మరోసారి స్పెషల్ థాంక్స్” అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడతూ ‘’మంచి టీనేజ్ లవ్ స్టోరి. మంచి రోల్ చేశాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
ఉల్కాగుప్తా మాట్లాడుతూ ‘’నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.
ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు,సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల,నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్. Tags: Andhra Pori Motion Poster , Akash Puri , Ulka Guptha

« PREV
NEXT »