చార్మి.. ఈ పేరు వింటే ఎవరికైనా బొద్దుగా, ముద్దుగా ఉండే ఓనిండైన రూపం గుర్తుకొస్తుంది. మాములుగా హీరోయిన్లు లావెక్కితే.. వారి కెరిర్ కు శుభం కార్డు పడ్డట్టే. కాని చార్మీ మాత్రం ఇందుకు మినహాయింపు. స్వతహాగానే బొద్దుగా ఉన్నాఈ ముద్దుగుమ్మకు అదెప్పుడు అడ్డురాలేదు. పైగా ఇటీవల కాలంలో చార్మి చేసినన్ని లేడి ఓరియెంటెడ్ మూవీలు ఎవరూ చేయలేదు కూడా.. అలాంటి చార్మి కెరీర్ లో కొంతకాలంగా బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది.దీంతో ఒక్కసారిగా అమ్మడు రూట్ మార్చేసింది..
నిత్యం
బొద్దుగా స్క్రీన్ నిండా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సడెన్ గా
సగమైపోయింది.తాజాగా చార్మికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో
సంచలనం రేపుతోంది..స్టైలిష్ టోర్న్ జీన్స్ లో జీరో సైజ్ లో కనిపిస్తున్న
చార్మిని చూసి అంతా షాక్ అవుతున్నారు.. అసలు ఫోటోలో ఉన్నది చార్మినేనా అన్న
అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు..
సోషల్
సైట్లలో హల్చల్ చేస్తున్న ఈ స్టిల్.. అమ్మడి అప్ కమింగ్ మూవీ
జ్యోతిలక్ష్మిలోనిదని తెలుస్తోంది.. గతంలోనే చార్మి ఈ సినిమా కోసం బరువు
తగ్గుతోందని వార్తలు వచ్చాయి.. దీంతో కచ్చితంగా ఈ ఫోటో నిజమేనని ఫిక్స్
అవుతున్నారు సినీ జనాలు. సినిమా వస్తేగాని అసలు విషయం తెలియదు మరి.
Tags: Charmi Kaur | Charmi Jyoyhi Lakshmi Movie | Jyothi Laksmi Movie
Social Buttons