Latest News

దొంగాట తెలుగు మూవీ రివ్యూ
by MTW - 0

మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌
మూవీ : దొంగాట
నటీనటులు: మంచు లక్ష్మీ, అడవి శేష్‌, మధు నందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృథ్వి తదితరులు
సినిమాటోగ్రఫీ: భాస్కర్‌ సామల
సంగీతం: సత్య మహావీర్‌, సాయికార్తీక్‌, రఘు కుంచె
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
సమర్పణ: విద్య నిర్వాణ
నిర్మాత: మంచు లక్ష్మీ
రచన, దర్శకత్వం: వంశీకృష్ణ
విడుదల తేదీ: 8.05.2015
మంచు లక్ష్మీ ఇప్పటివరకు తను సొంతంగా నిర్మించిన సినిమాలు కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోవడంతో ‘దొంగాట’తో ఓ కొత్త ఎటెమ్ట్‌ చేసింది. హార్రర్‌ సినిమాలకు, క్రైమ్‌ కామెడీలకు ఇటీవల ఎక్కువ ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి క్రైమ్‌ కామెడీతో హిట్‌ కొట్టాలని డిసైడ్‌ అయింది మంచు లక్ష్మీ. వంశీకృష్ణ అనే కొత్త దర్శకుడిగా అవకాశం ఇస్తూ తను, అడవి శేష్‌, మధునందన్‌, ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నిర్మించిన ‘దొంగాట’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు లక్ష్మీ చేసిన ఈ కొత్త ఎటెమ్ట్‌ ఎంతవరకు వర్కవుట్‌ అయింది? క్రైమ్‌ కామెడీ అనేది తెలుగు సినిమాకి కొత్త కాకపోయినప్పటికీ అదే ఫార్ములాతో ఈ సినిమాలో ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్‌ చేశారు? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: శృతి(మంచు లక్ష్మీ) టాలీవుడ్‌లో ఒక హీరోయిన్‌. వరస విజయాలతో టాప్‌ పొజిషన్‌లో వున్న శృతి తన పుట్టినరోజునాడే కిడ్నాప్‌కి గురవుతుంది. వెంకట్‌(అడవి శేష్‌, విజ్జు(మధునందన్‌), కాటంరాజు(ప్రభాకర్‌) ఆ కిడ్నాపర్స్‌. కిడ్నాప్‌ చేసిన శృతిని మాధాపూర్‌లోని తన మావయ్య ఇంటికి తీసుకొస్తారు విజ్జు మిత్ర బృందం. శృతిని బంధించి 10 కోట్లు ఇస్తేనే మీ అమ్మాయిని వదిలిపెడతాం, లేదంటే చంపేస్తాం అని శృతి తల్లి జ్యోతిలక్ష్మీ(ప్రగతి)కి ఫోన్‌ చేస్తారు కిడ్నాపర్స్‌. హీరోయిన్‌ కిడ్నాప్‌ అయిందని బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్‌ వస్తాయని తెలుసుకున్న జ్యోతిలక్ష్మీ యు.ఎస్‌.లో వున్న ప్రైవేట్‌ డిటెక్టివ్‌ బ్రహ్మి(బ్రహ్మానందం)ని పిలిపిస్తుంది. మరో పక్క ఎసిపి కనకాంబరం(పృథ్వి) కూడా ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. శృతిని కిడ్నాప్‌ చెయ్యాల్సిన అవసరం ఆ ముగ్గురికి ఏమిటి? ఈ కిడ్నాప్‌ ప్రాసెస్‌లో ఎవరు, ఎవరిని మోసం చేశారు? పోలీసులు, ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కిడ్నాప్‌ ముఠాని పట్టుకోగలిగారా? ఈ కిడ్నాప్‌ కథ ఎన్ని మలుపులు తిరిగిందీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈమధ్య వచ్చిన బుడుగు చిత్రంలో తల్లిగా ఒక మంచి క్యారెక్టర్‌ చేసిన మంచు లక్ష్మీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ కొత్త క్యారెక్టర్‌ చేసింది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఆమెను ఎస్టాబ్లిష్‌ చేసే షాట్స్‌ ఏమీ లేనప్పటికీ హీరోయిన్‌గా సినిమాలోని మిగతా పాత్రలకు తెలుస్తుంది. శృతి క్యారెక్టర్‌లో మంచు లక్ష్మీ పెర్‌ఫార్మెన్స్‌ ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలతో పోలిస్తే అంత గొప్పగా ఏమీ లేదనిపిస్తుంది. అయితే ఆ క్యారెక్టర్‌కి అంతకుమించి పెర్‌ఫార్మ్‌ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. అయితే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం బాగా చేసింది. అడవి శేష్‌ క్యారెక్టర్‌ కూడా చాలా సాదా సీదా క్యారెక్టర్‌. అయితే ఒక దశలో అతని క్యారెక్టర్‌ వచ్చిన టర్న్‌ మాత్రం డిఫరెంట్‌గా వుంటుంది. అది ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది. ఇక మధునందన్‌, ప్రభాకర్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. బ్రహ్మి మ్యాన్‌ ఆన్‌ ఫైర్‌గా బ్రహ్మానందం చేసిన క్యారెక్టర్‌ కూడా కొత్తదేం కాదు. అలాంటి క్యారెక్టర్స్‌ బ్రహ్మానందం లెక్కకు మించి చేశాడు. ఒకప్పుడు స్క్రీన్‌ మీద బ్రహ్మానందం కనిపించాడంటే అతనేం డైలాగులు చెప్తున్నాడో వినిపించనంత రెస్పాన్స్‌ థియేటర్‌లో వినిపించేది. ఈమధ్యకాలంలో బ్రహ్మానందం చేసిన సినిమాలు తక్కువైనా, కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో కనిపించినా ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ కనిపించలేదు. ప్రగతి, బ్రహ్మానందం మధ్య నడిచే సీన్స్‌లో, పృథి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్‌లో, ముగ్గురు కిడ్నాపర్స్‌ కాంబినేషన్‌లో చేసిన సీన్స్‌లో కొన్ని సందర్భాల్లో మాత్రమే బ్రహ్మానందం నవ్వించగలిగాడు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌: ఈ సినిమాలో టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ గురించి విశేషంగా చెప్పుకునేందుకు ఏమీ లేవు. కాకపోతే సినిమా ఆద్యంతం భాస్కర్‌ సామల ఫోటోగ్రఫీ బాగుందనిపిస్తుంది. సత్య మహావీర్‌ మ్యూజిక్‌ ఏమాత్రం ఆకట్టుకోలేదు. సెకండాఫ్‌లో 9 మంది హీరోలు, తాప్సీలతో చేసిన సాంగ్‌ మాత్రం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. రఘు కుంచె కంపోజ్‌ చేయగా మంచు లక్ష్మీ పాడిన పాట కూడా సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం కథకు తగ్గట్టుగా బాగా చేశాడు. ఎస్‌.ఆర్‌.శేఖర్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని ట్రిమ్‌ చేసి వుంటే ఇంకా బాగుండేది. సాయిమాధవ్‌ బుర్రా డైలాగుల గురించి చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని డైలాగ్స్‌. ఇంతకుముందు సాయిమాధవ్‌ రాసిన డైలాగ్స్‌ చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాకి కామెడీ టచ్‌ వుండే డైలాగ్స్‌ రాశాడు. అయితే అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. డైలాగ్స్‌ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్‌ అవ్వలేదు. డైరెక్టర్‌ వంశీకృష్ణ గురించి చెప్పాలంటే ఒక పాత ఫార్ములాను తీసుకొని దాన్ని కొత్తగా చెప్పాలని ట్రై చేశాడు. అయితే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు, ఇప్పటి ఆడియన్స్‌ టేస్ట్‌కి తగ్గట్టు సినిమా తియ్యడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. రామ్‌గోపాల్‌వర్మ నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘మనీ’ కిడ్నాప్‌ కాన్సెప్ట్‌తో చేసిన సినిమాయే. అందులో కథతోపాటే కామెడీ కూడా రన్‌ అవుతుంది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ చెయ్యాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప సహజంగా అనిపించదు. ఈ విషయంలో వంశీకృష్ణ మరి కాస్త జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. కిడ్నాప్‌ వెనుక వున్న అసలు కథ కూడా చాలా పేలవంగా, రొటీన్‌గా వుండడంతో ఆడియన్స్‌కి రీచ్‌ అవ్వలేదు. 

విశ్లేషణ: ఏమాత్రం కొత్తదనం లేని ఒక పాత కథతో కొత్త సినిమా తీసి మెప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. పాతికేళ్ళ క్రితమే కిడ్నాప్‌ కథకి కొత్త హంగులు జత చేయడానికి ట్రై చేశారు. కిడ్నాప్‌ కథ అని మొదట్లోనే తెలియడంతో తర్వాత ఏం జరుగుతుందీ అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కనిపించదు. ఈ విషయంలో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవకుండా కొంత కామెడీని ట్రై చేసినప్పటికీ అది అన్ని సందర్భాల్లో వర్కవుట్‌ అవ్వలేదు. బ్రహ్మానందం, ప్రగతి, పృథ్వి మధ్య వచ్చే డైలాగ్స్‌ చాలా చీప్‌గా వుండడమే కాకుండా నవ్వించే ప్రయత్నం చెయ్యలేకపోయాయి. అప్పటికీ ఆడియన్స్‌ బలవంతంగా నవ్వడానికి ట్రై చేశారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ సినిమా చేశామని, రెండున్నర గంటలపాటు ఆడియన్స్‌ నవ్వుతూనే వుంటారని ప్రమోషన్‌లో చెప్పినంతగా సినిమాలో మనకు కనిపించదు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా రొటీన్‌ సీన్స్‌తో, అనవసరమైన హడావిడితో వుంటుంది. రొటీన్‌ ఇంటర్వెల్‌ కాస్త కొత్తగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే హీరోయిన్‌ బర్త్‌డే సాంగ్‌ ఆడియన్స్‌కి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 9 మంది హీరోలు, తాప్సీ ఈ పాటలో పాల్గొన్నారు. సినిమాలో చెప్పుకోదగ్గది ఏదైనా వుంటే అది ఈ పాటే. సెకండాఫ్‌లో చివరి హాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది చాలా రొటీన్‌ సినిమా. కమర్షియల్‌గా ఈ సినిమా ఎ సెంటర్స్‌లోనే సక్సెస్‌ అయ్యే అవకాశం వుంది.


ప్లస్‌ పాయింట్స్‌: 
సినిమాలో కనిపించే 9 మంది హీరోలు, ఒక హీరోయిన్‌ 
ఇంటర్వెల్‌ బ్యాంగ్‌
అక్కడక్కడ పేలిన కామెడీ
మైనస్‌ పాయింట్స్‌: 
కథ, కథనం
ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గడం 
మ్యూజిక్‌
రొటీన్‌ సీన్స్‌

మన తెలంగాణా వరల్డ్.కామ్ రేటింగ్: 2.75/5


Tags: Dongaata Movie Review | Dongaata Telugu Movie Review | Lakshmi Manchu's Dongaata Movie Review | Lakshmi Manch's Dongaata Telugu Movie Review | Lakshmi Manchu Dongaata Movie Review | Dongaata Movie Release Date | Dongaata Movie Cast | Dongaata Movie Updates | Dongaata Movie Review Telugu

« PREV
NEXT »