సంచలన విజయాలు, విభిన్న కథాంశాలతో కూడిన
అద్భుత చిత్రాలు తీసిన డైరెక్టర్ మణిరత్నం నుంచి కొన్నాళ్ళుగా ఆ స్థాయి
విజయాలు సాధించే చిత్రాలు రాలేదు. మణిరత్నం పనైపోయిందనుకున్న టైమ్‌లో 'ఓకే
బంగారం' సినిమా అతన్ని ట్రాక్ ఎక్కించింది. తమిళంలో 'ఓ కాదల్ కన్మణి'
పేరుతోనూ, తెలుగులో 'ఓకే బంగారం'తోనూ వచ్చి అక్కడా ఇక్కడా మార్కులు
కొట్టేసింది. ఇంకా మణిరత్నంలో మేటర్ అయిపోలేదని నిరూపించింది. ఎన్ని
సినిమాలు తీసినా, సక్సెస్ కిక్‌ని ప్రదర్శించని మణిరత్నం, 'ఓకే బంగారం'
విషయంలో మాత్రం ఆనందాన్ని దాచుకోలేకపోతున్నారు.
అందరూ రైట్ ఆఫ్ చేసిన తర్వాత వారంతా
రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఆమాత్రం కిక్ ఉంటుంది మరి. తన నెక్స్ట్
సినిమా మాత్రం స్టార్ హీరోతోనేనని మణిరత్నం తన సన్నిహితులకు చెప్పాడట.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మణిరత్నం అడిగితే, సినిమా చేయననే హీరో బహుశా
ఉండడు. మహేష్, చరణ్ గతంలో మణిరత్నంతో సినిమా చేయొచ్చన్న ప్రచారం
జరిగింది. కానీ ఆ ప్రచారమేదీ నిజం కాలేదు. ఓ ప్రముఖ తమిళ హీరోతోనే మణిరత్నం
తీయబోయే తదుపరి సినిమా ఉండనుందని సమాచారం.
Tags: OK Bangaram Movie , OK Bangaram Movie Director Mani Ratnam
Tags: OK Bangaram Movie , OK Bangaram Movie Director Mani Ratnam
Social Buttons