మూవీ
ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన విషయం
తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవిని
గెల్చుకున్నారు. తన ప్యానెల్ లో నిలబడి, విజేతలైన శివాజీరాజా, కాదంబరి
కిరణ్, ఏడిద శ్రీరామ్ తదితరులతో పాటు నటుడు ఉత్తేజ్ తో సహా మెగాస్టార్
చిరంజీవిని కలిశారు రాజేంద్రప్రసాద్.
శనివారం సాయంత్రం 5 గంటలకు
చిరంజీవి స్వగహానికి వెళ్లారు. 'మా' నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఆయన
సహచరులను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు అందజేశారు. అలాగే,
విజేతలకు పుష్పగుచ్ఛాలిచ్చి, శాలువాతో సత్కరించారు.
Tags: Maa New President Rajendra Prasad and His Team Meet Chiranjeevi , Telugu Movie Artist Association , Rajendra Prasad , Chiranjeevi
Social Buttons