మాస్లో ఎన్నటికీ తరగనంత క్రేజ్ బాలయ్య సొంతం. అందుకే ఆయన సినిమాలకి ఓపెనింగ్స్ భారీగా వస్తుంటాయి. ఆ సినిమాకి బాగుందన్న టాక్ కూడా వచ్చిందంటే ఇక పట్టపగ్గాలుండవు. బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు నమోదవుతూ ఉంటాయి. అలాంటి బాలయ్య నటించిన ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందంటే పోటీగా మరొకరు బాక్సాఫీసు ఛాయలకి వచ్చే ధైర్యం చేస్తారా? ఛాన్సే లేదు. నిన్నటిదాకా బాలకృష్ణ నటించిన `లయన్` మే 1న ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రచారం సాగడంతో `దాగుడు మూత దండాకోర్` మినహా మరో సినిమా విడుదల తేదీ ఖరారు కాలేదు. రెండు మూడు వారాలు బాలయ్యకే అంకితం చేద్దామనుకొన్నారు. అయితే బాలయ్య మే 1న రావడం లేదని తాజాగా తెలియడంతో చిన్న సినిమాలు ఒక్కసారిగా ముందుకొచ్చాయి. లక్ష్మీప్రసన్న నటించిన `దొంగాట` మే 1న విడుదలవుతోంది. అలాగే సిద్ధార్థ్ నటించిన `నాలో ఒకడు` కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చేలా కనిపిస్తోంది. వీటితో పాటు మరో రెండు మూడు చిత్రాలు అదే రోజున విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొంటున్నాయి. బాలకృష్ణ `లయన్` మాత్రం మే 7న విడుదలవుతోంది. డీటీఎస్ పనుల్లో జాప్యం జరుగుతండడమే సినిమా విడుదల తేదీ వాయిదాకి కారణం అని సమాచారం.
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Tags : Kesha Khambhati | Actress Kesha Khambhati | Kesha Khambhati New Photos | Actress Kesha Khambhati Latest Photos |...
-
Srimanthudu Telugu Movie Teaser Featuring Mahesh Babu, Shruthi Haasan and others, Music By Devi Sri Prasad & Directed By Koratala Siva. ...

Hot This Week
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
‘కొచ్చాడయాన్, లింగ’ చిత్రాల ఘోరపరాజయం తర్వాత రజనీ నటించే చిత్రం ఏమిటి? అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. శంకర్ దర...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Tags: Dochey Movie Stills ,Naga Chaitanya Dohchey Movie Stills ,Naga Chaitanya , Naga Chaitanya Dochey Movie Photos , Naga Chaitanya M...

Social Buttons