తెలుగు సినీ రంగంలోని రాజకీయాలు 'మా' అని
పిలవబడే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ద్వారా బయటకు వచ్చాయి.
ఎన్నికలు జరిగిన తరువాత అందరం ఒకటేనని మాజీ అధ్యక్షుడు మురళీమోహన్,
ఇంకొందరు పెద్దలు చెప్పారేగానీ, కొత్త దర్శకుడు రాజేంద్రప్రసాద్ చుట్టూ
రాజకీయ 'కుట్ర' అలానే కొనసాగుతూ ఉందిట. రాజేంద్రప్రసాద్‌కి వ్యతిరేకంగా
సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం చక్రం తిప్పుతోందంటున్నారు.
'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఏ
కార్యక్రమం చేపట్టినప్పటికీ దాన్ని వ్యతిరేకించాలని ఆ వర్గం అనుకుంటుందట.
సీనియర్ నటుడు నరేష్ రూపంలో రాజేంద్రప్రసాద్‌కి వ్యతిరేకంగా డైలాగ్
వార్ మొదలయ్యింది. ఊహించని ఈ పరిణామాలతో రాజేంద్రప్రసాద్ టెన్షన్‌కి
గురవుతున్నారట కూడా. చేసే పనికి అడ్డంపడటం, లేదంటే రాజకీయాల్లోలా విమర్శలు
చేయడం ద్వారా రాజేంద్రప్రసాద్‌ని ఇరకాటంలో పెట్టాలనే ప్రత్యర్థుల వ్యూహం
అనైతికమని రాజేంద్రప్రసాద్ వర్గం అంటోంది. రాజకీయాల్ని మించిపోయాయి సినిమా
ఇండస్ట్రీ గొడవలు.
Tags: Maa Election Updates , Rajendra Prasad vs Jaya Sudha
Tags: Maa Election Updates , Rajendra Prasad vs Jaya Sudha
Social Buttons