Latest News

నాగార్జున మనం ఛానెల్ లాంచ్ డీటెయిల్స్
by MTW - 0

అక్కినేని నాగార్జున కొత్త ఛానెల్ పెట్టేందుకు శ్రీకారం చుట్టాడు. అవును మీరు విన్నది నిజమే. ఇటీవలే నాగార్జున భాగస్వామిగా ఉన్న మా టీవీని స్టార్ ఛానెల్ కు అమ్మేసిన సంగతి తెలిసింది. దీంతో నాగార్జున భవిష్యత్తులో మీడియా అవసరాన్ని గుర్తుంచుకొని కొత్త ఛానెల్ పెట్టాలని ప్లాన్ చేశాడు. దీనికి మనం అనే పేరు కూడా పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 24న ఈ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ ఛానెల్ లో నాగార్జున, పివిపి సంస్థతో పాటు మరికొందరు పార్ట్ నర్ గా ఉన్నారట. ఆల్రెడీ ఈ చానెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
అయితే మరో వైపు... మా టీవీ కోసం నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం మనం ఛానెల్ కు మారుతుందా అనే డిస్కషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ఛానెల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment