వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో పదకొండు మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డెబ్బై ఏడు వేల నగదు, ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట రాయుళ్లలో సినీ ఆర్టిస్టు కళ్యాణి కూడా పట్టుబడింది.
ఆదివారం రాత్రి పేకాట స్థావరం నడుపుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాటరాయుళ్లు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. కరాటే కళ్యాణిగా పాపులర్ అయిన కళ్యాణి ఈ పేకాట బ్యాచ్ లో దొరకడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది.
Social Buttons