సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం
పార్టీ తరపున తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డ ఆర్
కృష్ణయ్యకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీ
నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున కొత్త ఇన్ చార్జి నియామకం జరిగింది.
ఇక్కడ రంగారెడ్డి అనే వ్యక్తిని నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు.
ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు
అన్నీ ఆయనే చూసుకొంటాడనేది ఈ నియామక సారాంశం. మరి సాధారణంగా ఎమ్మెల్యే
ఉండగా.. నియోజకవర్గ ఇన్ చార్జి నియామకం అనేది జరగదు! ఎమ్మెల్యేలు పార్టీకి
తలాక్ చెప్పినప్పుడు.. అవతలికి జంప్ అయిపోయినప్పుడే.. తాము ఓడిపోయిన
నియోజవర్గాల్లోనూ... ఇన్ చార్జిల నియమాకం జరుగుతూ ఉంటుంది.
ఇలా ఇన్ చార్జిలుగా ఉండే వారికే..
భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందనేది కూడా ఒక నమ్మకం. మరి ఎల్బీ
నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం వ్యక్తే అయినా కూడా కొత్త ఇన్ చార్జి
వచ్చాడు. ఎందుకలా.. అంటే, కృష్ణయ్య పార్టీని సరిగా పట్టించుకోవడం లేదని..
అందుకే కొత్త ఇన్ చార్జి నియామకం జరిగిందని తెలుస్తోంది.మరి ఒక దశలో
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డ వ్యక్తి పరిస్థితి ఇక్కడికి రావడం
విశేషమే కదా!
Social Buttons