Latest News

గబ్బర్ డబ్బులు నేపాల్ బాధితులకు ఇవ్వను
by MTW - 0

అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన గబ్బర్ సినిమా కోసం చాలా మందే వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి భీభత్సమైన ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది తెలుగు దర్శకుడు క్రిష్. అయితే ఈ చిత్ర మొదటి రోజు వసూళ్లను నేపాల్ భూకంప బాధితులకు ఇస్తున్నట్టు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రకటించారని వార్తలొచ్చాయి. అయితే తాను అలా అనలేదని అక్షయ్ కుండబద్దలు కొట్టాడు. తాను సహాయం చేయదలచుకుంటే... గబ్బర్ రిలీజ్ వరకు ఆగనని అన్నాడు. గబ్బర్ మూవీ డబ్బులివ్వడానికి నేను ఆ చిత్ర నిర్మాతను కాదని ఓపెన్ గా చెప్పేశాడు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.



« PREV
NEXT »