ఏదైనా కార్యక్రమానికి హాజరు కావడానికి
హీరోయిన్లు గంటకి ఇంత అని ఛార్జ్ చేస్తుంటారు. హీరోల విషయంలో ఇంత టైమ్
అని లిమిట్ ఏమీ ఉండదు. వారి కాల్షీట్ బుక్ చేసుకుని, అడిగినంత
ఇచ్చేస్తుంటారు నిర్వాహకులు. తానా సభలకు అటెండ్ కానున్న మహేష్‌బాబు
కోటిన్నర డిమాండ్ చేసాడట. కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటానని ముందే క్లాజ్
పెట్టాడట. మహేష్‌కి ఒక్క కాల్షీట్కి కోటిన్నర ఇవ్వడం పెద్ద విషయమేం
కాదు.
అంత పెద్ద సూపర్‌స్టార్ అంత దూరం వచ్చి
వెళ్లినందుకు కోటిన్నర ఇచ్చేయవచ్చు. అసలే అమెరికాలో మహేష్‌కి ఉన్న
ఫాలోయింగ్ ఏంటనేది తెలియనిది కాదు. కాకపోతే ఈ మూడు గంటల నిబంధన విషయంలోనే
ఇంకా ఆలోచన జరుగుతోందట. కానీ మహేష్ మాత్రం మూడే గంటలు, కోటీ యాభై లక్షలు..
అని ఖరాఖండీగా చెప్పేసాడట. డీల్ సెట్ అయితే తానా సభల్లో సూపర్‌స్టార్
మెరుస్తాడన్నమాట. అదే జరిగితే జనం పెద్ద సంఖ్యలో వచ్చి పడిపోతారని
ప్రత్యేకించి చెప్పక్కర్లేదుగా!
No comments
Post a Comment