తమన్నా.. ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ రేస్ లో దూసుకుపోయిన మెరుపు తీగ. కాని కొంత కాలంగా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు అస్సలు టైం బాలేదు. ఆగడు సినిమా తర్వాత అమ్మడిని పలకరించేవారే లేకపోయారు.. అయితే ఇప్పుడు మిల్కీ బ్యూటీకి మళ్లీ కాలం కలిసొస్తోంది.మరోసారి వరుసగా చాన్సులు వచ్చిపడుతున్నాయి..
మొన్నటి వరకు బాహుబలి తప్ప చేతిలో మరో ప్రాజెక్టు లేని తమన్నా.. ప్రస్తుతం బెంగాల్ టైగర్ , నాగ్- కార్తీల మల్టీస్టారర్ మూవీల్లోనూ చాన్సు కొట్టేసింది. తాజాగా హీరో నాగచైతన్య అప్ కమింగ్ మూవీలోనూ తమన్నానే నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చైతు చందూ మొండేటి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాలో మొదటగా సమంతని అనుకొన్నారు. సడెన్ గా ఏమైందో ఏమోగాని ఇప్పుడు సమంత ప్లేస్ లో తమన్నాని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది..
గతంలో చైతు, తమన్నా పెయిర్ 100 % లవ్, తడాఖా మూవీల్లో నటించారు.ఆ సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుటయింది..ఇప్పుడు ఈ జంటగనుక మళ్లీ జతకడితే హ్యాట్రిక్ కొట్టాడం ఖాయమని అప్పడే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్.
Social Buttons