సునీల్..
కమెడియన్ గా ఉన్నపుడు ఈ పేరు ఏడాదికి కనీసం 20 సార్లు తెరపై
కనిపించేది. కానీ హీరో అయిన తర్వాత ఏడాదికి ఒక్కసారి కూడా భీమవరం
బుల్లోడు దర్శనమివ్వడం లేదు. అతితక్కువ టైమ్ లో బ్రహ్మానందం, అలీ
లాంటి వాళ్లను దాటి నెంబర్ వన్ కమెడియన్ గా చక్రం తిప్పాడు సునీల్.
కానీ హీరో అయ్యాక ఒక్కసారిగా ఈ కామెడీ హీరో జాతకం తిరగబడింది.
మొదట్లో అందాలరాముడు, మర్యాదరామన్న, పూల రంగడు లాంటి హిట్స్
వచ్చినా.. మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు లాంటి ఫ్లాపులు ఈ
హీరో కెరీర్ ను బాగా దెబ్బతీసాయి. ప్రస్తుతం వాసు వర్మ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్నాడు సునీల్. ఇది హిట్టైతేనే మనోడికి మంచి రోజులు లేదంటే
అంతే సంగతులు.
అందాల రాముడు హిట్టైన తర్వాత కూడా కమెడియన్ గానే కొనసాగిన
సునీల్.. హీరో కంటే నీకేం తక్కువ అని కొందరి చెప్పిన మాటలు విని
హీరోగానే ఫిక్సైపోయాడు. ప్రతీ సినిమాలో అవకాశం ఇచ్చే శీనువైట్ల,
త్రివిక్రమ్ లాంటి దర్శకులు కూడా హీరో అయ్యాక ఈ భీమవరం బుల్లోడికి
అవకాశం ఇవ్వలేదు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత రాజమౌళి మినహా..
సునీల్ వైపు ఏ అగ్ర దర్శకుడు కనీసం చూసిన పాపాన పోలేదు. చిన్నాచితకా
దర్శకులతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సునీల్. మరి
ఇలాంటి టైమ్ లో సునీల్ కెరీర్ ను చక్కదిద్దేది ఎవరు..? ఇదంతా సునీల్
స్వయంకృతమా.. లేదంటే చెప్పుడు మాటల ఫలితమా..? సునీల్ కు ఎప్పటికి
జ్ఞానోదయం అవుతుందో చూడాలి మరి..!
Social Buttons