దేవుడి
వరమిచ్చినా పూజరి కరుణించని చందంగా మారింది డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్
రాఘవలారెన్స్ పరిస్థితి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి లారెన్స్ తీసిన కాంచన 2
ఎట్టకేలకు తమిళ్ లో విడుదలై మంచి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ
సినిమా రిలీజైతే .. ఆ రిజల్ట్ తో తనపై పడ్డ బ్యాడ్ నేమ్ పోతుందని లారెన్స్
చాలా ఆశపడుతున్నాడు. అయితే ఆదిలోనే మనోడికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
తమిళంలో
ఏ ఆటంకాలు లేకుండా రిలీజ్ అయిన కాంచన 2కు ఇక్కడ మాత్రం పెద్ద కష్టమే
వచ్చిపడింది.ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ బకాయిపడ్డ ఫైనాన్షియర్లు
సినిమా విడుదల కానివ్వడంలేదని తెలుస్తోంది.ప్రస్తుతం సురేష్ కి సంబంధించిన
మూవీలేని ప్రొడక్షన్ లో లేకపోవడంతో.. తమ డబ్బులు చెల్లించేదాకా ఈసినిమా
విడుదల కానివ్వమని అంటున్నారట. ఇప్పటికప్పుడు అప్పు తీసుకున్న మొత్తాన్ని
చెల్లించే మార్గం లేకపోవడంతో సురేష్ డైలామాలో పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ
వారం వస్తుందని అనుకుంటున్న మూవీ.. మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది.
సో..
ఈ రకంగా కూడా లారెన్స్ ని ఇంకా అదృష్టం పరిక్షిస్తోందన్నమాట. పాపం సినిమా
ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. మనోడి పై ఉన్న బ్యాడ్ నేం ఎప్పుడు సైడ్
అవుతుందో చూడాలి మరి.
Social Buttons