సౌత్ ఇండస్ట్రీలో ప్రజెంట్ బిజీగా
ఉన్న భామల్లో సమంత ఒకరు. తెలుగు, తమిళ్ తేడా లేకుండా కుర్రాళ్ల హృదయాలను
కొల్లగొడుతున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం రెండు భాషల్లోనూ క్రేజీ ఆఫర్సే
ఉన్నాయి. తమిళ్ లో ఈ బ్యూటీ నటిస్తున్న తాజా మూవీ ’10 ఎంద్రాకుల్ల’.చియాన్
విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పబ్లిసిటీ మొత్తం.. సమంత చుట్టే
తిరుగుతోంది.
సమంత ఈ మూవీలో డేర్ డెవిల్ స్టంట్స్ చేయబోతోందని మొన్నటి
వరకు ప్రచారం జరగింది. దీంతో ఈ స్మార్ట్ బ్యూటీ సాహసం గురించి ఇప్పటికే
మీడియా కథలు, కథలుగా చెప్పుకుంటోంది..ఇదిలా ఉండగానే ఈ సినిమాకి సంబంధించి
మరో న్యూస్ కూడా ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తోంది. అది సమంత ఈ
మూవీలో డ్యూయల్ రోల్ గురించి. సమంత ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్ళవుతున్నా..
ఇప్పటి వరకు కెరీర్లో డ్యూయల్ రోల్ లో కనిపించలేదు.కాని తొలిసారిగా ఈ
మూవీలో సమంత రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతోందని తెలుస్తోంది.
సమంత
సింగిల్ గా కినిపిస్తేనే ఈలలతో గోల చేసే కుర్రాళ్లకు...ఇక డబుల్ రోల్
దర్శనమిస్తే పండగే మరి.. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్
చివర్లో రిలీజ్ కానుంది. అమ్మడి దర్శనం కావాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
Social Buttons