రేటింగ్: 3/5
నటీనటులు : రాఘవ లారెన్స్, తాప్సి, నిత్యా మీనన్, సుహాసిని, భాను చందర్, కోవై సరళ, శ్రీమాన్, పూజ రామచంద్రన్, మనోబాల తదితరులు
ఛాయాగ్రహణం – రాజవేల్ ఓళివీరన్
కూర్పు – కిషోర్
సంగీతం – థమన్
నిర్మాత – బెల్లంకొండ గణేష్ బాబు
రచన, దర్శకత్వం – రాఘవ లారెన్స్
చిత్ర నిడివి – 165 నిముషాలు
విడుదల తేది – మే 1, 2015
ఓ ఛానల్ లో కెమెరామెన్ గా పనిచేస్తున్న రాఘవ ( లారెన్స్) అదే చానల్లో ప్రోగ్రామ్ డైరక్టర్ గా పనిచేస్తున్న నందిని(తాప్సి)లు ప్రేమించుకుంటుంటారు. అయితే అపోజిట్ ఛానల్ వాళ్ళు దేవుళ్ళ పై చేసిన ఓ ప్రోగ్రామ్ వలన టిఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. దాంతో అంతవరకూ టి. ఆర్. పి. రేటింగ్ లో నెంబర్ వన్ గా ఉన్న ఈ ఛానల్ వెనకపడుతుంది. మళ్ళీ ఛానల్ రేటింగ్ పెరగాలంటే …. ఓ కొత్త ప్రోగ్రామ్ దెయ్యాలపై డిజైన్ చేయాలనుకుని భీమిలి బీచ్ రోడ్ లో ఉన్న ఓ పెద్ద భవనానికి వస్తారు. అక్కడ ప్రోగ్రామ్ చేస్తుండగా కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. ప్రోగ్రామ్ చేస్తుండగా అనుకోకుండా నందినికి బీచ్ ఇసుకలో ఓ తాళి తన చేతికి దొరుకుతుంది. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇది దెయ్యాలపై సినిమా కాబట్టి లాజిక్ ల గురించి వెతకాల్సిన అవసరం లేదు. కథ ఏదైనా, థియేటర్ లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా లేదా అనేదే ముఖ్యం. దర్శకుడు తను తీసుకున్న పాయింట్ కానీ, చెప్పాలనుకున్న విధానంలో కానీ నూటికి నూరు శాతం విజయం సాధించాడనే చెప్పాలి.
హారర్ ని కామెడీ ని మిక్స్ చేస్తూ ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకువచ్చాడు. ఇంటర్వెల్ తర్వాత కాస్త నెమ్మదించినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరింత వేగంగా ముందుకెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ అంతగా ఆకట్టుకోనప్పటికీ, నిత్యామీనన్ తన నటనతో ఆ ఎపిసోడ్ ని నిలబెట్టింది. నిత్యామీనన్ ఈ పాత్రకు ఒప్పుకోవడం నిజంగా సాహాసం. లారెన్స్ రకరకాల గెటప్స్ తో, నటనతో అదరగొట్టాడు. తాప్సి ఫరవాలేదు. బలమైన సన్నివేశాల్లో కొన్నిచోట్ల తన నటన తేలిపోయింది. కోవై సరళ తన స్లాంగ్ తో నవ్విస్తుంది.
కథాపరంగా మొదటి సీన్ నుంచి ఆకట్టుకుట్టుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ బాలేదు. గ్రాఫిక్స్ ఎక్కువ అవడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండుంటే మరింత బావుండేది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మూడ్ లైటింగ్, ఫ్రేమింగ్ బావున్నాయి. నేపథ్య సంగీతం భయపెడుతుంది. కానీ క్లైమాక్స్ లో రొద పెడుతుంది. గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
ఆకట్టుకునేవి:
కథనం
నిత్యామీనన్, లారెన్స్, తాప్సీ ల నటన
ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ
నేపధ్య సంగీతం
నిర్మాణ విలువలు
ఆకట్టుకోనివి:
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
గ్రాఫిక్స్
చిత్రనిడివి

Tags: Ganga (2015) Telugu Movie Review | Ragava Lawrence Ganga Movie Review | Kanchana 2 AKA ganga Movie Review | Ganga Telugu Movie Rating | Ragava Lawrence Ganga Movie Rating | Ganga (2015) Movie | Ganga (2015) Telugu Movie | Ganga Telugu Movie Updates
Social Buttons