ఇండస్ట్రీలో
ఇప్పుడు బతికున్న నటుల్నే పట్టించుకోవడం లేదు. అలాంటిది ఓ నటుడు
చనిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటికీ ఆయన స్థానం అలాగే ఉంది
అంటే.. అతడు ఏ స్థాయిలో ఇండస్ట్రీని శాసించాడో అర్థం చేసుకోవచ్చు. మనం
మాట్లాడుకునేది శ్రీహరి గురించే. రియల్ స్టార్ గా ప్రేక్షకులతో
నీరాజనాలు అందుకున్న ఈ నటుడు.. అనూహ్యంగా కన్నుమూసారు. ఈయన లోకాన్ని
విడిచి ఏడాదిన్నర గడిచినా.. ఇప్పటికీ శ్రీహరి స్థానాన్ని భర్తీ చేసే
నటుడు రానేలేదు.
శ్రీహరి పోయిన తర్వాత జగపతిబాబు ఆయన లోటు పూడ్చాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈయనకు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కారణంగా అన్ని రకాలు పాత్రల్లో జపగతిబాబును ఊహించుకోలేకపోతున్నారు దర్శకులు, రచయితలు. ముఖ్యంగా మాస్ కామెడీ చేయడంలో, పవర్ ఫుల్ పాత్రలు చేయడంలో శ్రీహరిది ప్రత్యేకమైన పంథా. శీనువైట్ల లాంటి దర్శకులు కేవలం ఆయనకోసమే పాత్రలు సృష్టించేవారు. అలాంటి కారెక్టర్స్ చేయడం ఇప్పుడు జగపతిబాబు వల్ల కూడా కావడం లేదు. మరోవైపు సన్నాఫ్ సత్యమూర్తితో ఉపేంద్ర కూడా శ్రీహరి స్థానం భర్తీ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. అయితే ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. ఇప్పటికీ రియల్ స్టార్ స్థానం మాత్రం అలాగే ఖాళీగా ఉంది. మరి టాలీవుడ్ కు శ్రీహరి లాంటి కారెక్టర్ ఆర్టిస్ట్ దొరకాలంటే ఇంకెన్నాళ్ళు పడుతుందో చూడాలి.

Tags: Special Story about Srihari | Real Start Srihari | Tollywood Real Start Srihari
Social Buttons