Latest News

థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా విశాల్
by MTW - 0




సినిమాల కంటే కూడా హీరోలు బ్రాండ్ అంబాసిడర్ గా ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తే... డబ్బుకు డబ్బుకు, పేరుకు పేరు వస్తుంది. అందునా... ఇంటర్నేషనల్ కంపెనీ దొరికితే పెరిగితే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు విశాల్ కు అలాంటి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ శీతల పానీయాల సంస్థ థమ్సప్ తమ డ్రింక్స్ ప్రచారం కోసం విశాల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది.
ఈ హాట్ సమ్మర్ లో తమిళ నాట తమ ఉత్పత్తుల్ని పెంచుకునేందుకు విశాల్ కున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆల్రెడీ ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కూడా పూర్తి చేశారట. మరి కొద్ది రోజుల్లోనే ఈ యాడ్ ఫిల్మ్ టీవీల్లో దర్శనమీయనుంది.

Tags: Vishal New Brand Ambassador for thums up | Vishal | Thums Up New Brand Ambassador Vishal
« PREV
NEXT »