Latest News

మహేష్ బాబు సినిమాలో సుకన్య
by MTW - 0







దక్షిణాదిలో మంచి నటిగా పలువురు టాప్ హీరోలతో కలిసి నటించిన సుకన్య కాస్త గ్యాప్ తర్వాత తెలుగు చిత్రంలో నటించబోతోంది. అది చిన్నా చితక సినిమా కాదు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో సుకన్య ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతోందట. అయితే ఆ పాత్ర ఏమిటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.


మహేష్, కొరటాల చిత్ర షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సంపత్ రాజ్, రాహుల్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags: Actress Sukanya in Mahesh babu Srimanthudu Movie | Actress Sukanya | Mahesh Babu | Srimanthudu
« PREV
NEXT »