Latest News

ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మృతి
by MTW - 0




గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీ మరణించారు. చాలా కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన స్వగృహం కొండాపూర్ లో శ్రీ మరణించారని డాక్టర్లు ధృవీకరించారు. 
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడే శ్రీ. అతని పూర్తి పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా పొన్నెకల్లు శ్రీ స్వగ్రామం. పోలీస్ బ్రదర్స్ చిత్రంలో ఆయన కెరీర్ ప్రారంభించారు. మనీ, మనీ మనీ, గాయం, సింధూరం, పోలీస్ బ్రదర్స్, అమ్మోరు, అనగనగా ఒక రోజు, ఆవిడ మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశి వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇటీవలే గోపిచంద్ సాహసం చిత్రానికి శ్రీ సంగీతమందించాడు. అంతే కాదు చక్రం చిత్రంలో జగమంత కుటుంబం నాది అనే పాట పాడాడు. 

Tags: Music Director Sri is No More , Music Director Sri Passes Away , Telugu Music Director Sri
« PREV
NEXT »