బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని కేసులు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. డైలీ సిరియల్ ను తలపించేలా విచారణల మీద విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణ జింకల వేట కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణను జోధ్ పూర్ కోర్టు మే 4వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అంతకు ముందు సల్మాన్ స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది.
1998లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్ జోద్‌పూర్‌లోని అటవీ ప్రాంతంలో దుప్పి, కృష్ణజింకలను వేటాడినట్టు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటి అక్రమ ఆయుధాల కేసు. ఈ కేసులో తరచుగా కోర్టు విచారణకు గైర్హాజరవుతుండడంతో ఇటీవల కోర్టు సీరియస్ అయింది. ఏప్రిల్ 29న కోర్టులో వాంగ్మూలాన్ని ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కోర్టుకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చాడు.
Social Buttons