సూపర్
స్టార్ రజనీకాంత్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన
సినిమా కాల్షీట్స్ కోసం... రజనీ సినిమా హక్కుల కోసం... ఆయన సినిమా రిలీజ్
చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పోటీ పడుతుంటారు. హక్కుల కోసం
పోటీలు పడి మరి దక్కించుకుంటారు. అయితే వరుసగా రెండు సినిమాలు ఆయన ఓ కీలక
నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేసింది. సూపర్ స్టార్ నటించిన కొచ్చడయాన్,
లింగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. దీనికి కారణాలు అనేకం
ఉన్నా.... భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే మెయిన్ కారణంగా ట్రేడ్ పండితులు
విశ్లేషిస్తున్నారు. కంటెంట్ కంటే.. కూడా ఖర్చు ఎక్కువ కావడంతో... అనుకున్న
స్థాయిలో బిజినెస్ జరగలేదన్నది కాదనలేని వాస్తవం. సినిమా ఫలితం ఫ్లాప్ అని
తేలిపోవడంతో... డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయి... రజనీకాంత్, చిత్ర
నిర్మాతల ఇంటి ముందు ధర్నాలు చేశారు. రజనీకాంత్ ను నమ్ముకున్న వాళ్లు
తీవ్రంగా నష్టపోయారు. దీంతో రజనీకాంత్ ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు
చేయకూడదని నిర్ణయించుకున్నారట. సినిమా కంటెంట్ ఎంచుకునేటప్పుడే బడ్జెట్ పై ఓ
అంచనాకు వచ్చిన తర్వాతే షూటింగ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. తక్కువ
బడ్జెట్ తో సినిమాలు తీసి... నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు
వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. దీనికి సంబంధించి పలువురు
సీనియర్లు... మార్కెటింగ్ ఎనలిస్టులు, డైరెక్టర్లతో రజనీకాంత్
చర్చిస్తున్నారట.
మరోవైపు...
రజనీకాంత్ తో శివాజీ, రోబో వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన శంకర్
మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. అలాగే మురగదాస్ కూడా రజనీ
కోసం మంచి కథ సిద్ధం చేశారు. వీరిద్దరితో పాటు సి.సుందర్ సైతం క్యూలో
ఉన్నారు. ఎవరు సినిమా తీసినా మినిమం బడ్జెట్ లోనే చేయాలని హుకుం జారీ
చేయనున్నారు మన సూపర్ స్టార్.
No comments
Post a Comment