ప్రముఖ
విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా ‘ఉత్తమ విలన్’ సినిమాతో ప్రేక్షకుల
ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి సంగీతం సమకూర్చిన
మూజిక్ డైరెక్టర్ గిభ్రన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.
కాగా కమల్ తాజా చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న గిభ్రన్ ‘రన్ రాజా
రన్’ ‘జిల్’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. అయితే
అంతకుముందు ఎన్నో జింగిల్స్ చేసిన గిభ్రన్ కు ‘ఉత్తమ విలన్’ ద్వారానే
బ్రేక్ వచ్చిందనడంలో అతిశయం లేదు.
ఇక
గిభ్రన్ పనితీరుతో ఇంప్రెస్ అయిన కమల్ వరుసగా నాలుగు ప్రాజెక్టులను అతని
చేతిలో పెట్టారు. కాగా ‘ఉత్తమ విలన్’ తో పాటు కమల్ నటిస్తున్న ‘విశ్వరూపం
2′, ‘పాపనాశనం’, ‘ఉలఘనాయగన్’ అనే చిత్రాలకు గిభ్రన్ నే సంగీత దర్శకుడిగా
అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు, మూజిక్ మాంత్రికుడు
ఇళయరాజా తర్వాత గిభ్రన్ మాత్రమే కమల్ హాసన్ నటించిన నాలుగు చిత్రాలకు
సంగీత దర్శకత్వం వహించారని ఇండస్ట్రీలో ప్రస్తుతం టాక్ నడుస్తోంది.
No comments
Post a Comment