Latest News

మే 3న వైవిధ్యంగా బెస్ట్ యాక్ట‌ర్స్‌ ఆడియో
by MTW - 0

విభిన్న‌మైన కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో చిన్న చిత్రాలు తీసి పెద్ద విజ‌యాలు సాధిస్తున్న మారుతి టీం వ‌ర్క్స్ ప్రోడ‌క్ష‌న్ లో సినిమా ల‌వ‌ర్స్ సిన‌మా బ్యాన‌ర్ లో మ‌రో వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో సిద్ద‌మైన చిత్రం బెస్ట్ యాక్ట‌ర్స్‌. ఉర్వ‌శి ధియోట‌ర్స్ అసోసియోష‌న్ తో ఈ చిత్రం చేస్తున్నారు. నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా, క్రితి, షామిలి, భార్గ‌వి లు జంట‌లుగా న‌టిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత‌గా అరుణ్ ప‌వ‌ర్ ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈరోజుల్లో, బ‌స్టాప్, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌, కొత్త‌జంట‌, ల‌వ‌ర్స్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జీవ‌న్ బాబు(జె.బి) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ నెట్ లో సంచ‌లనాన్ని క్రియోట్ చేయ‌టంతో యూనిట్ స‌భ్యులు సంతోషంతో వున్నారు. ఇప్ప‌డు జె.బి అందిచిన ఆడియో మే 3న వైవిద్యంగా ఈ చిత్ర ఆడియో ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. అన్ని కార్యక్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ.. మారుతి టీంవ‌ర్క్స్ తో అనుభందంగా మా బ్యాన‌ర్ సినిమా ల‌వ‌ర్స్ సినిమా పై ఖ‌ర్చుకు ఏమాత్ర వెన‌కాడ‌కుండా మా ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని చేశాము. ద‌ర్శ‌కుడు పూర్తి వినోదాత్మ‌కంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇటీవ‌లే ర‌ష్ చూశాం పూర్తిగా అంద‌రూ న‌వ్వుతూనే వున్నాము. న‌వ్విస్తూనే చ‌క్క‌టి క్లైమాక్స్ ని అందిచాడు. ఈచిత్రానికి యాప్ట్ టైటిల్ 'బెస్ట్ యాక్ట‌ర్స్' అనుకున్నాం. మా యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రి అభిప్రాయ‌లు తీసుకుని ఈ టైటిల్ ని క‌న్‌ఫార్మ్ చేశాము. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. న‌లుగురు అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిలు జీవితాల్లో మ‌రో కొంత‌మంది ఎంట‌ర‌య్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివ‌ర‌కి ఏమ‌య్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో స‌ప్త‌గిరి వచ్చి చేసే కామెడి కి ధియోట‌ర్ మెత్తం విజిల్స్ ప‌డ‌తాయి, ఈ చిత్రానికి సూప‌ర్‌డూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జె.బి సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ని మే3 న విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని ఈ స‌మ్మ‌ర్ లోనే విడుద‌ల చేస్తాము.. అని అన్నారుద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వ‌ర్ మాట్లాడుతు.. మారుతి గారికి ఈ క‌థ చెప్పాను, క‌థ కంటే క‌థ‌నం చాలా బాగుంద‌న్నారు. నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రాల రాజ‌మౌళి మారుతి గారు నాలాంటి కొత్త వారికి అవ‌కాశాల్ని ఇస్తూ ప్రోత్స‌హిస్తున్నారు వారికి నా ద‌న్య‌వాదాలు. ఈ చిత్రం న‌లుగు జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేస్తుంద‌నేది మెయిన్ కాన్సెప్ట్ వినోదం తో చెప్పాం. సెకండాఫ్ లో స‌ప్త‌గిరి చేసే అల్ల‌రి అంతాఇంతా కాదు. మారుతి గారి బ్యాన‌ర్ స‌ప్త‌గిరి అంటే న‌వ్వుల‌కి కొద‌వుండ‌దు. అలానే అంద‌రూ న‌టీన‌టులు సూప‌ర్బ్ గాన‌టించారు. జె.బి గారు అందించిన సూప‌ర్బ్ మ్యూజిక్ ని మే 3న విడుద‌ల చేస్తున్నాం. అలానే ఈ స‌మ్మ‌ర్ లో ఫ్యామిలి అంతా క‌లిసి చూసేలా మా చిత్రం వుంటుంది.. అన్నారు
నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా . క్రితి, షామిలి, భార్గ‌వి , స‌ప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, కుమార్‌సాయి త‌దిత‌రులు..
ఆర్ట్‌.. గోవింద్‌, పి.ఆర్.ఓ..ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్.. గౌత‌మ్ మ‌న్న‌వ‌, సంగీతం- జె.బి, ఎడిటింగ్.. ఉద్ద‌వ్‌.ఎస్‌.బి, కెమెరా.. విశ్వ.డి.బి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. దాస‌రి వెంక‌ట స‌తీష్‌, స‌హ‌-నిర్మాత‌లు.. సందీప్ సేన‌న్‌, అనీష్‌.ఎమ్‌.థామ‌స్‌, నిర్మాత‌.. కుమార్ అన్నంరెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- అరుణ్ ప‌వ‌ర్.
« PREV
NEXT »