విఐపి(విక్టరీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్)
సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత
గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘రణం 2’. ఈ చిత్రానికి
హీరో మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆర్తీ అగర్వాల్, నిధిలు
హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్
మాట్లాడుతూ..‘మా దర్శకుడు మరియు హీరో అయినటువంటి అమ్మ రాజశేఖర్‌గారు..హీరో
గోపీచంద్‌తో చేసిన ‘రణం’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ
తెలిసిందే. ఆ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా..అమ్మ రాజశేఖర్ ఈ ‘రణం 2’ని
తీర్చిదిద్దారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్
నుండి ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల
చేయనున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ
చిత్రం ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..’
అని అన్నారు.
అమ్మ రాజశేఖర్, నిధి, పృథ్వి, నల్లవేణు,
శ్రవణ్, ఫిష్ వెంకట్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:
మణిశర్మ; కెమెరామెన్: శ్రీధర్; నిర్మాత: గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.
Tags: Ranam 2 movie censor report , Ranam2 Movie , Amma Rajashekar Ranam 2 Movie , Ranam 2 Movie Release Date
Tags: Ranam 2 movie censor report , Ranam2 Movie , Amma Rajashekar Ranam 2 Movie , Ranam 2 Movie Release Date
Social Buttons