Latest News

కలెక్షన్ల సునామీ గంగ మే 1న వచ్చేస్తోంది
by MTW - 0

రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించగా కాంచన(ముని2) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన గంగ-ముని3 మే 1న విడుదలవుతోంది. 
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... మా బేనర్ లో కాంచనగా వచ్చిన ముని 2 ఎఁతటి సంచలన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. ఇప్పుడు గంగగా నిర్మించిన ముని 3 చిత్రాన్ని మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రం తమిళ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో గంగ చిత్రం కూడా పెద్ద హిట్ అయి మా బేనర్ లో మరో సూపర్ హిట్ మూవీగా నిలుస్తుంది. రాఘవ లారెన్స్ పెర్ ఫార్మెన్స్, డైరెక్టర్ గా ఆయన టేకింగ్ , తాప్సి, నిత్యా మీనన్ గ్లామర్ సినిమాకి పెద్ద ఎస్సెట్స్ అవుతాయి. ఈ చిత్రం తర్వాత త్వరలోనే ముని 4 చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం అని అన్నారు.



« PREV
NEXT »