అసెంబ్లీలో
తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని..ఇది తనతో పాటు సాటి
కళాకారులైన ప్రజాప్రతినిధులను కూడా అవమానించినట్లేనని వైకాపా ఎమ్మెల్యే
రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం
అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు విలేకర్లతో మాట్లాడిన ఆమె తనను యాక్టర్
అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చాలా చీప్‌గా బిహేవ్ చేశారని ఆమె మండి
పడ్డారు. ఓ ఆర్టిస్ట్ గురించి టీడీపీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతుంటే
స్పీకర్ కోడెల ఖండించకపోగా హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆమె విమర్శించారు.
టీడీపీ
వ్యవస్థాకులు ఎన్టీఆర్, బాలయ్య యాక్టర్లు కాదా అని ఆమె టీడీపీ
ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, బుచ్చయ్య చౌదరి
లాంటి వాళ్లు ఎంత నీచంగా మాట్లాడినా స్పీకర్ ఖండించడం లేదన్నారు.
చీఫ్
విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ వీడియోలు దొంగిలించి బయటకు లీక్ చేసినా
ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ఎండీ
ఎం.రాధాకృష్ణ తనపై స్థాయిని మరచి సంపాదకీయం రాశారని విమర్శించారు.
No comments
Post a Comment