Latest News

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ
by MTW - 0

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ
రేటింగ్: 3/5
విడుదల తేదీ : 21 మార్చి 2015
దర్శకత్వం : నాగ్ అశ్విన్
నిర్మాత : ప్రియాంక దత్
సంగీతం :రధన్
నటీనటులు : నాని, మాళవిక నాయర్, విజయ్, రీతు వర్మ…
యంగ్ హీరో నాని హిమాలయాలకు ట్రిప్ వేసి చేసిన లేటెస్ట్ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కథని హిమాలయాలకు ముడిపెట్టి అక్కడే ఎక్కువ భాగం షూట్ చేసిన ఈ సినిమా ఉగాది కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర టీం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేసిన ఈ సినిమా ఎలా ఉంది.? నానికి కావాల్సిన బ్రేక్ ఇచ్చిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం(నాని) పసుపతి ఇండస్ట్రీస్ అనే మల్టీ మిలీనియర్ కంపీనీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. పసుపతి ఇండస్ట్రీస్ హెడ్ అయిన పశుపతి(నాజర్) సుబ్బు టాలెంట్ ని చూసి తన కుమార్తె రియా(రీతు వర్మ)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అందులో భాగంగా సుబ్బు – రియాలకి నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న టైములో బిజినెస్ పరంగా సుబ్బుకి ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది.
దాన్ని సాల్వ్ చేసే పనిలో ఉండగా.. గోవా నుంచి సుబ్బు బెస్ట్ ఫ్రెండ్ రిషి(విజయ్ దేవరకొండ) మరియు ఆనంది(మాళవిక నాయర్) సుబ్బు లైఫ్ లోకి వస్తారు. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిన సుబ్బు తన ప్రొఫెషనల్ వర్క్ ని కాస్త పక్కన పెడతాడు. రిషి రోజూ దూద్ కాశీ వెళ్ళాలని సుబ్బును అడుగుతున్నాడు.. కట్ చేస్తే ఓ ఇన్సిడెంట్.. ఆ ఇన్సిడెంట్ తర్వాత సుబ్బు ఆనందిని తీసుకొని హిమాలయాలకు బయలు దేరుతాడు.. సుబ్బు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి.? అసలు సుబ్బు హిమాలయాల ట్రిప్ వేసాడు.? అందులో తనకి తోడుగా ఆనందిని ఎందుకు తీసుకెళ్ళాడు.? అసలు ఈ ట్రిప్ లో ఏం జరిగింది.? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నాగ్ అశ్విన్ ఇలాంటి ఓ సరికొత్త మరియు డిఫరెంట్ ఐడియాని తీసుకొని దాన్ని ఎంతో కన్విన్స్ అయ్యేలా చెప్పడం మెచ్చుకోదగినది. ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు టాలీవుడ్ లో చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఓకే చేసి ఎంతో బ్రేవ్ హార్ట్ తో ఈ సినిమా చూసిన నిర్మాతలకి కూడా హ్యాట్సాఫ్ చెప్పాలి. నాని మరిసారి తన లోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో టాప్ ఎండ్ బిజినెస్ మాన్ లక్షణాలను పర్ఫెక్ట్ గా చూపిన నాని సెకండాఫ్ లో ఎంతో మెచ్యూర్ ఎమోషన్స్ ని చూపించాడు. రీతువర్మ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే రిచ్ గర్ల్ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.
ఈ సినిమాతో పరిచయమైన మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ టాలీవుడ్ కి దొరికిన యంగ్ టాలెంట్ అని చెప్పుకోవాలి. మాళవిక నాయర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. రిషి అనే పాత్రకి విజయ్ పూర్తి న్యాయం చేసాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ, ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే చాలా వేగంగా అయిపోతుంది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉన్నాయి. విజువల్స్ చూసే ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. లెజండ్రీ యాక్టర్ కృష్ణంరాజు చేసిన అతిధి పాత్ర కథలో కావాల్సిన ఎమోషన్ ని క్రియేట్ చేసింది.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ ని అంత ఆసక్తిగా వేగంగా నడిపించినా, సెకండాఫ్ విషయానికి వచ్చే సరికి కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో మేజర్ ట్విస్ట్ లు ఉంటాయి. వాటిని సరిగా రివీల్ చెయ్యలేదు. సెకండాఫ్ లో ఆడియన్స్ కి ఎక్కువ ఆసక్తిని క్రియేట్ చేసే అంశాలు లేకపోవడంతో ఊహాజనితంగా తయారవుతుంది.
అలాగే ఈ సినిమాలో రెగ్యులర్ సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేవు. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్స్ ని సరిగా తీయలేదు. సినిమా లెంగ్త్ పరంగా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా వరకూ కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.
సాంకేతిక విభాగం :
మేము పైన చెప్పినట్టు ఈ సినిమా మేజర్ హైలైట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి.. రాకేష్ – నవీన్ లు కలిసి అందించిన గ్రాండ్ విజువల్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. ముఖ్యంగా హిమాలయాస్ ని చాలా అద్భుతంగా చూపించారు. రధన్ అందించిన పాటలు చొఅఒఅ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. పాటలకంటే తను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సినిమా కోసం రాసిన డైలాగ్స్ లో ప్రతి దానికి ఓ అర్థం ఉంది. ముఖ్యంగా కృష్ణంరాజు పాత్రకి రాసిన డైలాగ్స్ బాగున్నాయి.
స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎందుకంటే సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ కొత్త కాన్సెప్ట్ ని కొత్త డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా బాగా తీసాడు. ఫస్ట్ పార్ట్ ని అంత బాగా రాసుకున్న అతను సెకండాఫ్ లో కాస్త తడబడడమే తను చేసిన మిస్టేక్. స్వప్న సినిమాస్ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment