Latest News

పోర్న్ స్టార్ ను ఫాలో అవ్వనున్న ప్రియాంక చెల్లెలు
by MTW - 0

తెలుగులో తొలి అవకాశం అందుకున్నా... అక్క ప్రియాంకా చోప్రా లాగా బాలీవుడ్ లోనే తొలిసారి ఆన్ స్క్రీన్ పై తళుక్కుమంది మనారా. అయితే తొలి సినిమాతోనే ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోవాలని అనుకున్న ఈ ముద్దుల చెల్లెలు... జిద్ లో మితిమీరిన అందాల ప్రదర్శనతో జనాలను ఆకట్టుకోవాలని ట్రై చేసింది. అయితే...సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో... అమ్మడి అందాలు అడవికాచిన వెన్నెలే అయ్యాయి. దీంతో అక్క రూట్ సరికాదని ఫిక్స్ అయిన మనారా.. పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకుందట. మొదటి సినిమానే బోల్తా కొట్టడంతో ఇన్నాళ్లూ బాలీవుడ్ లో మనారాను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక ఇలా అయితే లాభం లేదని అనుకుందో ఏమో... అమ్మడు అవకాశం ఇస్తే... ఏ రేంజ్ లో అయినా అందాలు ధారబోయడానికి సిద్ధమన్న సంకేతాలు పంపించింది. ఇక ఇలాంటి అమ్మడి కోసమే ఎదురు చూస్తున్న ఓ బాలీవుడ్ ఔత్సాహిక నిర్మాత...సన్నీలియోన్ 'ఏక్ పహేలీ లీలా' సినిమా రేంజ్ లో మనారాతో ఓ ఎర్రోటిక్ అడల్ట్ మూవీని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. లేక లేక వచ్చిన అవకాశం కావడంతో.. మనారా కూడా సన్నీ రేంజ్ లో చెలరేగిపోయేందుకు సిద్ధమైపోయిందట. మరి... తొలి సినిమాలోనే విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన ప్రియాంక చెల్లెలు... ముందు ముందు జూనియర్ సన్నీ అనిపించుకుంటుందేమో చూడాలి.

« PREV
NEXT »

No comments

Post a Comment